టీటీడీ చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు కార్పొరేషన్లకు తెలుగుదేశం ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవికి కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన పుట్టా సుధాకర్ యాదవ్‌ను ఎంపిక చేశారు. డీఎల్ రవీంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకుని, మైదుకూరు నుంచి పోటీ చేయించాలన్న ఉద్దేశంతో సుధాకర్ యాదవ్‌ను టీటీడీ చైర్మన్‌గా ఎంపిక చేశారు. వర్ల రామయ్యకు కీలకమైన ఆర్టీసీ చైర్మన్ పదవికి ఎంపిక చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డిని రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించారు.













