ఏపీ అసెంబ్లీ, సచివాలయ ఆకృతులు ఖరారు!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పరిపాలన నగరంలో నిర్మించే శాసనసభ, సచివాలయ భవనాల బాహ్య ఆకృతుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు ఖరారు చేశారు. లండన్నకు చెందిన నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థ శాసనసభ, సచివాలయ భవనాలను సంబంధించి మూడేసి బాహ్య ఆకృతుల్ని సిద్ధం చేసి తీసుకొచ్చింది. శాసనసభ భవనం ఆకృతిని బోర్లించిన లిల్లీ ఫ్లవర్‌ని పోలిన విధంగా రూపొందించింది. శాసనసభ పై నుంచి రాజధానిని వీక్షించేలా గ్యాలరీలు ఏర్పాటు చేసింది. అసెంబ్లీ భవనం ఎత్తు 250 మీటర్లు, పొడవు 200 మీటర్లు, వెడల్పు 200 మీటర్లు ఉంటుంది. సాధారణ సందర్శకుల్నీ ఈ భవనంలోకి తనుమతిస్తారు. ఈ భవనం మధ్య లోంచి టవర్‌పైకి వెళ్లేందుకు లిఫ్ట్‌లు ఉంటాయి.
తాజా ఆకృతిలో మొత్తం రెండు వ్యూయింగ్ గ్యాలరీలు ప్రతిపాదించారు. 80 మీటర్ల ఎత్తులో ఒకటి గ్యాలరీ, 250 మీటర్ల ఎత్తులో చివర్న మరో గ్యాలరీ ఉంటాయి. 80 మీటర్ల ఎత్తు గ్యాలరీ నుంచి ఒకేసారి 300 మంది, 250 మీటర్ల ఎత్తున గ్యాలరీ నుంచి ఒకేసారి 25 మంది రాజధానిని వీక్షించే వీలుంటుంది. టవర్ చివరి భాగం గ్లాస్‌తో రూపొందిస్తారు. అది ఒక క్యాప్సూల్ మాదిరిగా కనిపిస్తుంది.













