Vallabhaneni Vamsi : మాజీ వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 11 మంది అనుచరుల అరెస్ట్..
ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు గడుస్తోంది.. ఈ నేపథ్యంలో ప్రజల కోసం చేసింది ఎంతో తెలియదు కానీ గత ప్రభుత్వం తాలూకు లోటుపాట్లు ఎత్తి చూపడానికే ఎక్కువ సమయం పడుతుంది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన దారుణాలు.. దాడులు.. వాటిపై కేసులు.. తదుపరి విచారణలు. ప్రస్తుతం ఆంధ్రలో రాజకీయాల స్పంద ఇలా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)అనుచరులు అనే ఒక పదకొండు మందిని అరెస్టు చేశారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే(Gannavaram ex MLA).. వల్లభనేని వంశి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ హయాంలో గన్నవరం లోని టిడిపి కార్యాలయం పై జరిగిన దాడి కేసులో నిందితులుగా ఈ 11 మందిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో వల్లభనేని వంశీ పిఏ రాజా (వంశీ PA) కూడా ఉండడం గమనార్హం. మరోపక్క ఇదే ఘటనకు సంబంధించి విజయవాడ రూరల్, బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు ప్రాంతాలకు చెందిన మరి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ కేసులో 71 మందికి పైగా వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఎఫ్ఐఆర్లో A1 నిందితుడిగా వల్లబనేని వంశీ పేరు ఉంది. గత ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై జరిగిన దాడి నేపథ్యంలో వరుసగా ఇప్పటికీ ఆగకుండా ఈ అరెస్టులు చోటు చేసుకుంటున్నాయి. అప్పట్లో ఈ విషయంపై కేసు నమోదైన.. వైసీపీ (YCP ) ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. దీంతో తాజాగా కూటమి ఏర్పడిన తర్వాత పోలీసులు ఈ కేసు పై కసరత్తు మొదలుపెట్టారు.
ఆ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం తప్పులు.. ఈ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం లోటుపాట్లు.. వీటి కోసమే ఉన్న కాస్త సమయం గడిచిపోతుంటే.. సామాన్యుడి గోష పట్టించుకునే నాధుడు లేకుండా పోతున్నాడు. తెలుగు రాష్ట్రాలలో పంతాల రాజకీయాలకు ఉన్న ప్రాముఖ్యత ప్రజల కోసం నడిపే రాజకీయాలకు లేకుండా పోతోంది. లక్షల కొద్ది కేసులు పెండింగులు ఉన్నాయి నేపథ్యంలో కేవలం తమకు సంబంధించిన కేసుల మీద మాత్రమే జోరు పెంచుతున్న నాయకులు ప్రజలను ఎప్పుడు పట్టించుకుంటారో తెలియకుండా ఉంది.













