తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్..
ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన ఎన్నో పనులకు సంబంధించిన విచారణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై జరిగిన దాడికి సంబంధించిన కేస్ హాట్ టాపిక్ గా మారింది. అయితే వల్లభనేని వంశీ అమెరికాకి పారిపోయాడు అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా గన్నవరంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. గురువారం రోజు రాత్రి వంశీ అనుచరుడైన రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం శుక్రవారం వంశీ ప్రధాన అనుచరుడైన యూసఫ్ పఠాన్ పోలీసుల చేతికి చిక్కాడు. ఓ చిన్ని సినిమా సీక్వెన్స్ లో జరిగిన ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగి ఫైనల్ గా ఈరోజు వంశీ అరెస్టు వరకు వెళ్ళింది.
గన్నవరంలోని టిడిపి కార్యాలయం పై దాడి కేసులో వంశీని ఏ 71 గా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే కేసుకు సంబంధించిన 18 మందిని అరెస్టు చేయడం జరిగింది. ఈ దాడిలో నేరుగా పాల్గొనక పోయినప్పటికీ ఎమ్మెల్యే ప్రోద్బలం తోటి దాడి జరిగింది అని వంశీ పై ఆరోపణ. అరెస్టు చేసిన వారిలో చాలామంది ఈ దాడికి ముఖ్య కారణం వంశీ ప్రోగ్రాం అని స్పష్టంగా చెప్పడంతో అతన్ని ఏ1 గా మార్చాలని పోలీసులు భావిస్తున్నారట.
హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తుండగా వంశీ కారుని వెంబడించిన పోలీసులు అతని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వెంటనే అతని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అప్పట్లో వంశీ టీడీపీ నేతలపైనే కాకుండా చంద్రబాబు సతీమణి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇక వంశీ అరెస్ట్ పై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.













