హైదరాబాద్ కు వెళ్తే పార్టీ మారినట్టేనా ?
తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై మంత్రి పితాని ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నానని దుష్రృచారం జరుగుతోందని అన్నారు. తాను వైసీసీలోకి వెళ్తున్నట్లు ప్రచారం చేయడం దారుణమని అన్నారు. తాను పార్టీ మారడం లేదని, టీడీపీలోనే కొనసాగుతానని సృష్టం చేశారు. తన జీవితం తెరిచిన పుస్తకమని పేర్కొన్నారు. తాను హైదరాబాద్, ఢిల్లీ వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. తాను ఎక్కడికి వెళ్లకూడదా అని అన్నారు. హైదరాబాద్కు వెళ్తే పార్టీ మారినట్టేనా అని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు తనను ఆశీర్వదిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై విమర్శలు చేసిన వారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. 2 సార్లు ఓడిపోయా..3సార్లు గెలిచానని.. మరోసారి పోటీకి వెళ్తున్నానని సృష్టం చేశారు. వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని, తనపై వైసీపీ కుట్రలు పనిచేయవని అన్నారు.













