చంద్రన్న పాలిట దానకర్ణుడిగా మారిన పవన్..
బీజేపీ తో పొత్తు కోసం చంద్రబాబు కంటే కూడా పవన్ ఎక్కువ ఆరాటపడుతూ వచ్చాడు. దీనికోసం ఆయన చేయని ప్రయత్నాలు లేవు ,తినని తిట్లు లేవు. అయితే ఇన్ని చేసి ఆఖరకు మళ్ళీ తిరిగి కూటమి కన్ఫర్మ్ అయ్యాక మరొకసారి త్యాగానికి రెడీ అయ్యాడు పవన్. గత నెల 24న పవన్ , చంద్రబాబు ఇద్దరూ కలిసి తమ రెండు పార్టీల పొత్తుకు నాందిగా తొలి విడత జాబితా ను విడుదల చేశారు. బీజేపీ కోసం తన కేవలం 24 సీట్లకే పరిమితమయ్యాను అని పవన్ పేర్కొన్నారు. ఇక ఇప్పుడు చంద్రబాబుతో కలిసి ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో పొత్తుల మీద కీలక చర్చలు జరిపారు. ఇందులో భాగంగా ఎంపీ సీట్ల విషయం లో బీజేపీ తన పట్టు వదిలే ప్రసక్తి లేదు అని క్లారిటీ ఇచ్చింది. టీడీపీ.. బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే ఇవ్వాలి అని భావించింది. అయితే సుదీర్ఘ మంతనాల తర్వాత 10 నుంచి 6 కు బీజేపీ ఫిక్స్ అయింది. కాగా ఈ ఒక ఎక్స్ట్రా ఎంపీ సీటు టిడిపి తన కోటా లోంచి ఇవ్వడం లేదు. జనసేనకు కేటాయించిన మూడు ఎంపీ సీట్లు నుంచి కోత విధించి ఒక సీటును బీజేపీ కి ధారపోస్తుంది టీడీపీ. ఈ విధంగా బాబు మరోసారి రాజకీయ చాణిక్యుని అని నిరూపించుకుంటే.. పవన్ మాత్రం దానవీరశూరకర్ణ టైటిల్ ఫిక్స్ అయిపోయాడు.













