పవన్ కల్యాణ్ పోటీ.. భీమవరం నుంచే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో భీమవరం నుంచే పోటీ చేస్తారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ భీమవరం నుంచే రాష్ట్ర రాజకీయాలకు అడుగులు పడనున్నాయన్నారు. పవన్ తరపున నియోజకవర్గ ప్రజలకు తాము అందుబాటులో ఉంటామన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషించనుందని అన్నారు. ఈ నెల 17న పవన్ కల్యాణ్ భీమవరం జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆనంద పంక్షన్ హాల్లో ఆర్జీలు స్వయంగా స్వీకరిస్తారని తెలిపారు. ప్రజలు పవన్ కల్యాణ్‌ను స్వయంగా కలసి వారి సమస్యలను వివరించవచ్చునని తెలిపారు.













