సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పవన్
అఖిలపక్ష భేటికి ఆహ్వానించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశం టీడీపీ ఎత్తుగడలో భాగమేనని విమర్శించారు. మరోసారి ప్రజలను మోసం చేయాలని టీడీపీ భావిస్తోందన్నారు. ఏపీలో సమావేశాలు నిర్వహిస్తే ప్రత్యేకహోదా రాదని, ప్రజాప్రతినిధులతో పార్లమెంట్ ఎదుట ఆందోళన చేయాలని పవన్ సూచించారు. హోదా సాధనే లక్ష్యంగా అందరూ ఉద్యమించాల్సిన తరుణం ఇదని ఆయన అభిప్రాయపడ్డారు. హోదాపై బీజేపీ నాన్చుడి ధోరణి అవలంభిస్తుంటే, టీడీపీ నాలుగేళ్లుగా రాజీ పడుతూ వచ్చిందని ఆరోపించారు. హోదా అంశంలో తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా ప్రధాన రాజకీయ పక్షాలన్నీ భాగస్వాములేనని అన్నారు.













