అదును చూసి ఆమరణ దీక్ష చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అమరణ దీక్ష చేస్తానన్న జనసేన అధినేతకు పవన్‌కు, తొందర పడొద్దని వామపక్షాలు సూచించాయి. ఆమరణ దీక్షను చేపట్టేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాక, ఒక కార్యచరణను ప్రకటించడం మంచిదని హితవు పలికాయి. దీనికి పవన్ కూడా సానుకూలంగానే స్పందించారు. హోదాతో సహ ప్రజా సమస్యలపై ఐక్యంగా ఉద్యమిద్దామని వామపక్షాలను పవన్ కోరగా, ఆ పార్టీలు కూడా సముఖత వ్యక్తం చేశాయి. విజయవాడలోని జనసేన పార్టీ తాత్కాలిక కార్యాలయంలో పవన్‌తో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఆ పార్టీల నేతలు సమావేశమయ్యారు.













