Pawan Kalyan : పీవీఆర్ ప్రశాంత్ ను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్
దుబాయ్, అబుదాబిలో సెప్టెంబరు 9 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ టీ20 క్రికెట్ పోటీలకు టీమిండియా మేనేజర్‌గా నియమితులైన పీవీఆర్ ప్రశాంత్ (PVR Prashanth)ను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభినందించారు. భీమవరం జనసేన ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు (Ramanjaneyulu) ( అంజిబాబు) కుమారుడైన ప్రశాంత్ విశాఖ పర్యటనలో ఉన్న పవన్‌ను కలిశారు. తెలుగు వ్యక్తికి ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం పట్ల డిప్యూటీ సీఎం ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ప్రశాంత్ మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆంధ్ర క్రికెట్ సంఘం ( ఏసీఏ) ఉపాధ్యక్షుడిగా పని చేసిన ప్రశాంత్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) అల్లుడు. గతంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి క్రికెట్ (Cricket) కు ప్రాతినిధ్యం వహించారు.







