అమిత్‌షా సభలో ప్లకార్డులపై భాజపా ఆగ్రహం
ఇటీవల భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విజయవాడ పర్యటన సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్లకార్డుల ప్రదర్శనపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. భాజపా-తెదేపా పొత్తుపై పలువురు ప్లకార్డులను ప్రదర్శించడాన్ని భాజపా అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ప్లకార్డులు ప్రదర్శించినవారు, ప్రోత్సహించిన నేతల వివరాలను సేకరించింది. ఈ అంశానికి సంబంధించిన వీడియోలను పరిశీలించిన పార్టీ అధిష్ఠానం బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.
గోదావరి జిల్లాల నేతలపై అమిత్‌షా అసంతృప్తి
గోదావరి జిల్లా నేతలపై బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌షా అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలియవచ్చింది. ఇటీవల విజయవాడ బహిరంగసభలో గోదావరి జిల్లాలకు చెందిన బిజెపి కార్యకర్తలు తెలుగుదేశంతో పొత్తు వద్దని ప్లకార్డులు ప్రదర్శించిన విషయం విదితమే. అయితే ఈ సంఘటన మీడియాలో ప్రముఖంగా రావడంతో అమిత్‌షా జరిగిన సంఘటపై ఆరా తీసారు. వాటికి సంబంధించిన వీడియోలు పరిశీలించారు. అయితే ప్లకార్డులు పట్టుకున్న వారు అంతా శాశనమండలి సభ్యుడు, మంత్రి అనుచరులని నిర్ధారించారు. అప్పటి వరకూ పోత్తు పై ఊగిసలాడుతున్న సందర్భంలో అమిత్‌షా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి లంచ్‌కు వెళ్లడంతో ఈ ఇరువురు నేతలు నిర్ఘాంతపోయి అప్పటికపుడు ప్లకార్డుల ప్రదర్శనకు ఆదేశాలు ఇచ్చి తమ నిరసనను వ్యక్తం చేయించారు.













