న్యూమెక్సికో వర్సిటీతో ఏపీ వ్యవసాయం
ప్రపంచంలోనే తొలిసారిగా మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసిన అమెరికాలోని న్యూమెక్సికో స్టేట్ యూనివర్సిటీ సాయంతో రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో న్యూమెక్సికో వర్సిటీ, రాష్ట్ర వ్యవసాయ రంగం పరస్పరం సహకరించుకునే అంశాలను పరిశీలించాలని సూచించారు. వర్సిటీ ప్రతినిధులు అమరావతికి వచ్చి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మెక్సికో వర్సిటీలో ఏపీకి ఉపయోగపడే వాటిని పరిశీలించాలని వ్యవసాయ, ఉద్వాన వర్సిటీ అధికారులకు మంత్రి సూచించారు.













