జగన్ అధికారంలోకి వచ్చాక… గ్రామసీమలను పూర్తిగా
పేదల పక్షపాతినని చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదలపై కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. యువగళం పాదయాత్ర 150వ రోజు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం పరిధిలో జరిగింది. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ జగన్రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామీణాభివృద్ధి పూర్తిగా పడకేసిందన్నారు. గ్రామసీమలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పంచాయతీల అభివృద్ధికి ఫైనాన్స్ కమిషన్ విడుదల చేసిన రూ.8,660 కోట్ల నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. జగన్ పాలన వచ్చిన తర్వాత ఉప్పు సాగు చేస్తున్న రైతులకు కనీస సాయం అందడం లేదన్నారు. పండించిన ప్రతి పంటకు బీమా ఉంది కానీ, ఉప్పుకి మాత్రం లేదన్నారు. 150వ రోజు పాదయాత్రలో ఉప్పు రైతులతో సమావేశం పెట్టుకోవడం సంతోషంగా ఉందన్నారు.













