Nara Lokesh: ఎస్కేయూ అక్రమాలపై విచారణకు కమిటీ : మంత్రి లోకేశ్

అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ (Sri Krishna Devaraya University) లో 2029-24 నడుమ జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) శాసనసభలో తెలిపారు. కంప్యూటర్ల (Computers) కొనుగోలులో దుర్వినియోగం, యూనివర్సిటీ వాహనాలను వ్యక్తిగత అవసకాలకు వినియోగించడం, నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతలు, నియామకాలు, రిక్రూట్‌మెంట్‌లో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడంపై కమిటీ వేస్తామన్నారు. వంద రోజుల్లో నివేదిక తెప్పించి బాధ్యుతలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభ్యులు ఎంఎస్ రాజు(MS Raju) , పల్లె సింధూర రెడ్డి (Palle Sindhura Reddy) అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిస్తూ పారదర్శకంగా విశ్వవిద్యాలయాలు నడిపించాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం ఉందని తెలిపారు.