ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు : లోకేశ్
చంద్రగిరి నియోజకవర్గంలో 40 రోజుల తర్వాత రీపోలింగ్ నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈసీ మోదీ కమిషన్ ఆఫ్ ఇండియా గా మారిందని ఆరోపించారు. టీఎన్ శేషన్ హయాంలో సంస్కరణలు తెస్తే, ఇప్పుడు ఉన్న ఎన్నికల కమిషన్ వాటికి వ్యతిరేక పద్ధతిలో వెళ్తోందని విమర్శించారు. ఈసీపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. బెంగాల్లో ఒక రోజు ముందే ప్రచారం ఆపడం..దేశ చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ జరగలేదన్నారు. 23న వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల్లో టీడీపీ సంపూర్ణ మెజార్టీతో గెలుస్తుందని, ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు బాధ్యతలు స్వీకరిస్తారని సృష్టం చేశారు.













