46 ఏళ్లకి ఉద్యోగం… 45 ఏళ్ల రత్నం మాయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ట్వీట్టర్లో విమర్శలు గుప్పించారు. 46 ఏళ్లకి జగన్‌గారికి ఉద్యోగం వచ్చింది. 45 ఏళ్ల రత్నం పెన్షన్ మాయం అయింది. పాదయాత్రలో గుర్తొచ్చిన ప్రజల కాళ్ల నొప్పులు, కుర్చీ ఎక్కిన వెంటనే జగన్ మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు తెలివిగా మాట మార్చి వారిని మోసం చేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ రూపంలో ఒక్కో మహిళకు రూ.1.20 లక్షలు ఇవ్వాలన్నారు. జగన్ గారు మడమ తిప్పడం, మాట మార్చడం ద్వారా ఒక్కో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళకి రూ.45 వేలు నష్టం అని పేర్కొన్నారు.













