అది అజ్ఞానమో, అమాయకత్వమో అర్థంకాలేదు : లోకేష్
ఎందులో ఆదర్శం అని చంద్రబాబుని జగన్ అడగటం అజ్ఞానమో, అమాయకత్వమో అర్థంకావడం లేదంటూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీటర్లో ఎద్దేవా చేవారు. ఉమ్మడిరాష్ట్రంలో దేశంలో తొలిసారి విద్యుత్ సంస్కరణలు చేపట్టి నష్టాల్లో ఉన్న సంస్థలను గట్టెక్కించి చంద్రబాబు ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు కష్టాన్నే మీ నాన్నగారు (వైఎస్ రాజశేఖర్రెడ్డి) ఉచిత విద్యుత్ అని సోకు చేసుకున్నారని జగన్ను ఉద్దేశించి ఆరోపించారు. 2009 ఎన్నికలకు ముందు డిస్కంలకు రూ.6,600 బకాయి పెట్టి.. సంస్థలను దివాళా తీయించిన ఘనత మీ నాన్నగారిదేనని అన్నారు. మీ నాన్న పెట్టిన కన్నాన్ని పూడ్చేందుకు 2015లో ఉదయ్ పథకంలో నష్టాలు సరిచేసే ప్రయత్నం చేశామని అన్నారు.













