రాష్ట్రంలో అంతా రివర్స్ పాలన : బాలయ్య
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల వ్యవహారంపై ఆయన స్పందిస్తూ.. ఒకే రాష్ట్రం ఒకే రాజధానితో అభివృద్ధి సాధ్యమని సృష్టం చేశారు. దేశంలో ఎక్కడైనా రాజధాని ఒకే చోట ఉంటుందన్నారు. రాష్ట్రంలో అంతా రివర్స్ పాలన సాగుతోంది. నాడు తండ్రి మండలిని పునరుద్ధరిస్తే.. నేడు తనయుడు రద్దు చేస్తున్నాడు. తండ్రి ఆశయాలను నెరవేరుస్తానని అధికారంలోకి వచ్చి నీరుగారుస్తున్నాడు. మండలి చైర్మన్ పట్ల మంత్రుల భాష అభ్యంతరకరం. కక్షసాధింపు చర్యలతో రాష్ఠ్రాభివృద్ది కుంటుపడుతుంది అని విమర్శించారు.













