పవన్ కోసం మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్న బౌన్సర్లు.. ముద్రగడ
ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన క్షణం నుంచి అదే పనిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏదో ఒక రూపంలో వ్యంగ్యాస్త్రాలు విసురుతూనే ఉన్నారు. తాజాగా పవన్ ని టార్గెట్ చేసి ముద్రగడ మరొక పాయింట్ వదిలారు. పార్టీ కార్యకర్తలను పవన్ కనీసం తన వద్దకు కూడా రానివ్వడని ముద్రగడ తీవ్రంగా విమర్శించారు. పవన్ చుట్టూ ఎప్పుడూ బౌన్సర్లు ఉంటారని.. జనసేన పార్టీ కార్యకర్తలను పవన్ దరిదాపులకు కూడా వాళ్ళు రానివ్వరని ఆయన విమర్శించారు. రోజుకు మూడు షిఫ్టుల్లో ఎప్పుడూ పవన్ చుట్టూ బౌన్సర్లు పనిచేస్తారని ముద్రగడ అన్నారు. అంత కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఉన్న పవన్ తనపై బ్లేడు బ్యాచ్ దాడి చేశారు అని చెప్పడం వింతగా ఉందని ముద్రగడ అన్నారు. పవన్ ది కేవలం పిరికితనం, చేతకానితనం అని ముద్రగడ విమర్శించారు. అందుకే అతను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా కూడా చేశారు. మరోవైపు పిఠాపురంలో ప్రచారం కొనసాగిస్తున్న పవన్ తీవ్ర జ్వరం కారణంగా అస్వస్థతకు గురై చికిత్స నిమిత్తం ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకొని హైదరాబాదు చేరుకున్నారు.













