పవన్ కు వ్యతిరేకంగా పిఠాపురం లో ముద్రగడ పాలిటిక్స్..
ఈసారి ఎన్నికల్లో మిగిలిన అన్ని నియోజకవర్గాల కంటే కూడా పిఠాపురం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది. ఏమని పవన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తాను అని ప్రకటించాడో కానీ.. పిఠాపురం కి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇటు రేపు ఎన్నికల రిజల్ట్ ఎలా ఉంటుంది అన్న విషయంపై జరుగుతున్న సర్వేలలో భీకరమైన పోరు కన్ఫామ్ అని అర్థమవుతుంది. సంక్షేమ పథకాల వల్ల.. అధికార వైసీపీ పార్టీ తనకంటూ ఓటు బ్యాంకు ని రిజర్వ్ చేసుకుంది. ఈ ఐదేళ్ల పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న కొన్ని వర్గాలు వైసీపీ కి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ వర్గాల మద్దతు పూర్తిగా టీడీపీ వైపే ఉంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే లేటెస్ట్ గా పిఠాపురం లో ముద్రగడ ఎంట్రీ మరింత ఆసక్తికరంగా మారింది. పిఠాపురంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారి సంఖ్య ఎక్కువ. అందుకే పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. వైసీపీ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వంగా గీతా ను బరిలోకి దింపింది. ఇప్పుడు ముద్రగడ ఎట్టి పరిస్థితుల్లో పవన్ గెలవకూడదని.. వైసీపీ ను గెలిపించుకోవాలని కాపు నేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పిఠాపురం అభివృద్ధిపై వైసీపీ ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తోందని.. పిలిస్తే పలికే నేత కాబట్టి వంగా గీత స్థానికంగా ఎంతో మేలు చేస్తుంది అని ముద్రగడ అదే పనిగా ప్రచారం చేస్తున్నారు.













