ఏపీ కూటమి కొలనులో కమలం దళాలు విచ్చుకునేనా..
ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఫైనల్ గా టీడీపీ, జనసేన ,బీజేపీ మధ్య పొత్తుల లెక్కలు తేలిపోయాయి. బీజేపీ కోరుకున్నట్లుగానే ఆరు ఎంపి స్థానాలు దక్కించుకుంది. జనసేన మాత్రం ఇచ్చిన 3 ఎంపీ సీట్స్ లో కూడా ఒక సీట్ ని త్యాగం చేసింది. అధికారికంగా ఇంకా ప్రకటించినప్పటికీ బీజేపీ ,జనసేన ఎంపీ అభ్యర్థులు ఏ స్థానాల నుంచి పోటీ చేస్తారు అన్న విషయంపై ఒక క్లారిటీ వచ్చినట్లు టాక్.అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమహేంద్రవరం, నరసాపురం, తిరుపతి లోక్ సభా స్థానాల నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. జనసేన ఎంపీ అభ్యర్దులు కాకినాడ, మచిలీపట్నం నుంచి పోటీ చేయనున్నట్లుగా సమచారం. ఇప్పటికే బీజేపీ ఆరు ఎంపీ స్థానాలకు గాను ఇద్దరు అభ్యర్థులు ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది.బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు..పురందేశ్వరి రాజమహేంద్రవరం నుంచి బరిలోకి దిగుతున్నారు.ఇక నరసాపురం నుంచి రఘురామక్రిష్ణం రాజులు పోటీ చేస్తున్నారు. మిగిలిన నాలుగు స్థానాలు నుంచి కూడా కమలం తరఫున బలమైన ప్రత్యర్థులే దిగుతారు అని టాక్.ఈ రోజు బీజేపీ జాతీయ స్థాయిలో తన రెండో లోక్ సభ అభ్యర్థుల జాబితా ను ప్రకటిస్తారని..అందులో ఏపీకి చెందిన రెండు ఎంపీ స్థానాల అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించటం ఖాయమంటున్నారు.. ఇక బీజేపీ పోటీ చేసే 10 అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే అందుతున్న సమాచారం ప్రకారం ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు,కైకలూరు, విశాఖ ఉత్తరం, పాడేరు..ఈ 6 స్థానాలపై క్లారిటీ వచ్చింది.మిగిలిన నాలుగు స్థానాల పై వివరాలు త్వరలో తెలుస్తాయి.













