నేను ఎంపీగా మళ్లీ గెలిస్తే.. సీఎం రాజీనామా చేయాలి
తాను భారీ మెజారిటీతో గెలుస్తాననే నమ్మకం ఉందని, లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 5 వరకు తనపై అనర్హత వేటు వేయించడానికి వైసీపీకి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మోదీ, అమిత్‌షా, స్పీకర్‌కు ఎవరికైనా తనపై ఫిర్యాదు చేసుకోవాలన్నారు. తాను ఎంపీగా గెలిస్తే మాత్రం సీఎం వైఎస్ జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13న నర్సాపురం వెళ్తున్నానని, రెండు రోజులు అక్కడే ఉంటానని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రెండు రోజులు పోలీసులు తనకు భద్రత కల్పించాలన్నారు. అమరావతి కోసం తన ఎంపీ పదవికీ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.













