రఘురామ సంచలన ప్రకటన.. త్వరలో ఎంపీ పదవికి
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో ఎంపీ పదవికీ రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనపై అనర్హత వేటు వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తానే సమయం ఇస్తున్నానని వారంలో నిర్ణయం చెప్పాలని పరోక్షంగా వైసీపీ అధినాయకత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనపై అనర్హత వేటు వేయకపోతే తాను రాజీనామా చేస్తానని తెలిపారు. తాను రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తానని, వైసీపీపై ఎంత వ్యతిరేకత ఉందో ఎన్నికల ద్వారా తెలియజేస్తానన్నారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించేందుకు, రాజధానిగా అమరావతే కొనసాగేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో తన ఎన్నిక ద్వారా నిరూపిస్తానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కొన్ని పత్రికలు, చానల్స్‌ను బ్యాన్ చేయటాన్ని ఈ సందర్భంగా రఘురామ తీవ్రంగా ఖండించారు.













