అమరావతి అంశంలో ఏపీ హైకోర్టు.. సెన్సేషనల్ తీరు : రఘురామ
రాజధాని అమరావతి అంశంలో ఏపీ హైకోర్టు సెన్సేషనల్ తీర్పు ఇచ్చిందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాజధాని అమరావతి అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. అమరావతి తీర్పు సందర్భంగా ఢల్లీిలోని నివాసంలో సిబ్బందికి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ అమరావతి ఉద్యమానికి మద్దతు ఇచ్చిన జనసేన పవన్ కల్యాణ్, సుజనా చౌదరి, బీజేపీ, ప్రతీ పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు. తక్కువ ఖర్చుతో మంచి కాపిటల్ ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు కృషి చేశారన్నారు. అమరావతి రాజధాని అంశంలో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు శిరస్సువంచి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. అమరావతిని కొంచెం కూడా కదపలేరని ముందే చెప్పానన్నారు.
సీఆర్డీఏ చట్టప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని, ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పననులు పూర్తి చేయాలని కోర్టు ఆదేశిచిందని తెలిపారు. మనోవేదనతో మరణించిన రైతుల హత్యలు అవ్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. అమరావతి అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్తే ఇంకా దెబ్బలు పడతాయని హెచ్చరించారు. అప్పు చేస్తారా లేక కేంద్రాన్ని బతిమలుతారా అమరావతిలో అభివృద్ధి చేయాలి. నేను ముఖ్యమంత్రి పదవి చేయలేను అనుకుంటే వదిలి వెళ్లిపోతారా మీరే అలోచించుకోండి అని తెలిపారు. ఎప్పుడు మాట్లాడే సజ్జల, బొత్స సత్యనారాయణ సమన్వయం పాటించాలన్నారు. అనవసరంగా కోర్టులను తప్పుదోవ పట్టడం, వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని అన్నారు.













