వైసీపీ ప్రభుత్వం అనుమతిస్తే మహాపాదయాత్రలో
వైసీపీ ప్రభుత్వం అనుమతిస్తే మహాపాదయాత్రలో పాల్గొనాలని ఉందని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగనన్న గృహపథకం వైసీపీ పార్టీలో గందరగోళంలోకి నెట్టిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లపై ప్రజా తిరుగుబాటు జరుగుతోందన్నారు. పథకాల కింద ఇచ్చిన ఇళ్లకు రూ.10 వేలు కట్టాలని, దిగజారి డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారని అప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవన్నారు. జగన్ రెడ్డి పాలన తుగ్లక్కు తలపించే విధంగా ఉందని ఎద్దేవా చేశారు. రైతుల మహాపాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఎన్ని పిచ్చి పనులు చేసినా రైతుల పాదయాత్ర ఆగదన్నారు. రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ కన్నా దారుణంగా మద్యం దోపిడీ జరుగుతోందన్నారు. ఇకైనా మద్యం దుకాణాల దగ్గర దోపిడీ ఆపాలన్నారు.













