దాడులు జరిగే ప్రమాదం .. జాగ్రత్తగా ఉండాలి : రఘురామ
అమరావతి రైతుల మహాపాదయాత్ర దిగ్విజయంగా జరుగుతోందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాపాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. పాదయాత్రపై దాడులు జరిగే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాజధాని రైతులంటే టీడీపీ కార్యకర్తలన్న మంత్రి బొత్స వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. ఆ మంత్రి వెనుక ఎవరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. మంగళగిరి, తాటికొండ ప్రజలపై బొత్స చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బద్వేలు ఉప ఎన్నిక గెలుపు నిజమైన గెలుపు కాదని అన్నారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్‌కు రెక్కీ నిర్వహించారని, దీనిపై ఆధారాలతో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశానన్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ అడిగితే ఆధారాలు అందజేస్తానన్నారు. సోలార్ కార్పొరేషన్ అవినీతి ఆరోపణలపై సీఎం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.













