చంద్రబాబు ప్రధాని కావాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని, ప్రధాని కావాలని, లోకేష్‌ను ముఖ్యమంత్రిని చెయ్యాలని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సూచించారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌కి బుర్రలేదని, ప్రణాళికా లేదని ధ్వజమెత్తారు. జగన్మోహన్రెడ్డికి అన్నీ వాళ్ల తాత రాజారెడ్డి బుద్ధులే వచ్చాయి. ఈ విషయం వాళ్ల నాయన రాజశేఖర్‌రెడ్డే నాతో చెప్పాడు. జగన్ ఎండల్లో కష్టపడి తిరుగుతున్నాడు. ఏం లాభం. 24 గంటలూ చంద్రబాబూను కొట్టాలంటాడు. తన్నాలంటాడు. ఉరి తీయాలంటాడు. ఇప్పుడు మోదీతో ఆయనకు కొత్త బంధుత్వం ఏర్పడింది అని విరుచుకుపడ్డారు. రాయలసీమ యాసకు రాజకీయ చెణుకుల్ని జోడించి జగన్‌పైనా, ప్రధాని మోదీ పైనా జేసీ మండిపడ్డారు. మీరు ఇలా ఉంటే కుదరదు. పద్ధతి మార్చుకోవాలి అంటూ తనదైన శైలిలో చంద్రబాబుకు నిర్మొహమాటంగా చెప్పారు.













