లోకేశ్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మండిపడ్డారు. మహానాడులో ఆయన ప్రసంగిస్తూ లోకేశ్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి? అని ప్రశ్నించారు. అలాగే చంద్రబాబు ప్రధానమంత్రి పదవి ఎందుకు వద్దంటున్నారో తనకు తెలియడం లేదన్నారు. చంద్రబాబు కచ్చితంగా ప్రధానమంత్రి కావాలని కోరారు. విభజన తర్వాత రాష్ట్రం కోసం చంద్రబాబు ఎంతో కష్టపడ్డారన్నారు. పోలవరంపై అవినీతి జరిగిందంటే కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. ముడుపులు అందాయంటే జగన్‌కే ముట్టాయని చెప్పారు. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం ఏపీకి ప్రత్యేక హోదా రాదని చెప్పారు. బీజేపీతో కాపురం వద్దని చంద్రబాబుకు ఎప్పుడో చెప్పానన్నారు. ప్రత్యేక హోదా రాదని నాలుగేళ్ల క్రితమే తెలియజేశానన్నారు. హోదా బదులు ప్యాకేజీ ఇస్తానంటే దానికి చంద్రబాబు బోల్తా పడ్డారని జేసీ చమత్కరించారు.













