Kotamreddy : నీకు రాజకీయ విమర్శలు చేసే అర్హత లేదు : కోటంరెడ్డి
అమరావతి మహిళలపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో 11 స్థానాలతో ప్రజలు గుణపాఠం చెప్పినా వైసీపీ నేతల (YCP leaders) తీరు మారలేదని విమర్శించారు. రాజకీయ పిపీలకం సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచం. ఆయన్ను రాష్ట్ర బహిష్కరణ చేయాలి. ఇది రాష్ట్రానికి శ్రేయస్కరం. సజ్జలా నువ్వు జగన్ (Jagan) గుమస్తావి. రాష్ట్ర రాజకీయాలు, ప్రజలతో సంబంధం లేదని బంట్రోతువి. నీకు రాజకీయ విమర్శలు చేసే అర్హత లేదు అని పేర్కొన్నారు.













