కడప ఉక్కు… ఆంధ్రుల హక్కు
కడప ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని మంత్రి నారా లోకేష్ మరోసారి పునరుద్ఘాటించారు. రాష్ట్ర విభజన వేళ పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా స్పందించిన లోకేష్ ఎంపీ రమేష్, బీటెర్ రవి చేపట్టిన దీక్ష ఏడు రోజుకు చేరుకున్నా కేంద్రం ఇంతవరకు స్పందించకపోవడాన్ని ఆయన దుయ్యబట్టారు. ఆంధ్రుల పట్ల బీజేపీ వైఖరి మరోసారి భయటపడిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మనోభావాలను దెబ్బతీయడం సరికాదన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితలు చెప్పారు. అసత్య ప్రచారాల బదులు, రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం ఢిల్లీ యాత్రలు చేస్తే బాగుటుందని సూచించారు.













