బ్యాంకాక్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు మంత్రి లోకేశ్ భరోసా
మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి: బ్యాంకాక్ ఉద్యోగాల పేరుతో మోసపోయి మయన్మార్ లో చిక్కుకున్న నిరుద్యోగ యువకులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. మయన్మార్ లో చిక్కుకున్న బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ భవన్ అధికారులను ఆదేశించారు. యువత సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడవద్దని కోరారు. వాళ్ళని సురక్షితంగా తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. ఇక ఇలాంటి వాటికి ఎవరూ మోసపోకూడదు, యువత సైబర్ నేరాలపై చైతన్యవంతులై అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.








