సీఎం కుర్చీ కోసం ఎన్ని అరాచకాలైనా చేయగల సమర్థుడు జగన్ : మంత్రి దేవినేని
అధికారమే పరమావధిగా జగన్ వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు – ఫారం-7 తానే దరఖాస్తు చేయించానని జగన్ ఒప్పుకున్నారు – ఎన్నికల ముద్దాయి జగనే అన్నది బహిర్గతమైంది – జగన్ ఒప్పుకున్నందున ఈసీ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి – తెలంగాణలో 24 లక్షల ఓట్లు తొలగించి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు – ఏపీలో 54 లక్షల ఓట్లు తొలగించి అధికారంలోకి రావాలని జగన్ కుట్ర పన్నారు – సీఎం కుర్చీ కోసం ఎన్ని అరాచకాలైనా చేయగల సమర్థుడు జగన్ – నెల్లూరు సభలో జగన్ మాట్లాడిన భాష జుగుప్సాకరం – ఓ అజెండా లేకుండా దిక్కుతోచని స్థితిలో జగన్ మాట్లాడుతున్నారు.













