Minister Anam : దేవాదాయశాఖ ప్రక్షాళన తిరుమల నుంచే : మంత్రి ఆనం
దేవాదాయశాఖకు సంబంధించిన ప్రక్షాళన తిరుమల(Tirumala) నుంచే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆదేశించారని రాష్ట్ర మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి (Anam Ramnarayana Reddy) తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఉద్యోగులు (TTD employees) , అర్చకుల సమస్యలు, భక్తులకు మెరుగైన సేవలందించేందుకు సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. టీటీడీ ఉద్యోగుల సమస్యలపై చర్చించి సీఎంకు నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు అన్ని ఆలయాల్లో ప్రశాంతమైన వాతావరణంలో భక్తులకు దర్శనాలు చేయిస్తామన్నారు. దేవాదాయశాఖ, టీటీడీ కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటికే కామన్ గుడ్ ఫండ్ (Common Good Fund) నుంచి 200 ఆలయాల పునర్ నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చాం. 300 ఆలయాలకు ధూప దీప నైవేద్యాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాం అని తెలిపారు.













