దీనిపై పవన్ కల్యాణ్ మాట్లాడాలి : మంత్రి అంబటి
పరిహారం సొమ్ములో లంచం ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. మృతుడి కుటుంబానికి పరిహారం ఇప్పించిందే తానని తెలిపారు. ఈ విషయంలో తనపై విమర్శలు జనసేన పార్టీ చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. పరిహారం సొమ్ములో లంచం తీసుకునే దౌర్భాగ్యం నాకు లేదన్నారు. నిజంగా నేను కక్కుర్తి పడివుంటే రాజీనామా చేస్తా. మృతుడి కుటుంబానికి పరిహారం ఇప్పించిందే నేను. శవాలపై నేను పేలాలు ఏరుకోవడమేంటి? అని ప్రశ్నించారు. రూ.2 లక్షలు డబ్బులు తీసుకునే నీచమైన మనస్తత్వం నాది కాదు. నన్ను అవినీతిపరుడిగా చిత్రీకరించే దుర్మార్గమైన ఆలోచన ఇది. వేరే వాళ్లతో ట్రోల్ చేయించడం కాదు. దీనిపై పవన్ కల్యాణ్ మాట్లాడాలి అని అన్నారు.













