151 కాదు… కుప్పంతో కలిపి 175 స్థానాల్లో
151 కాదు ఈసారి కుప్పంతో కలిపి 175 స్థానాల్లో గెలుస్తామని ఆంధ్రద్రపేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా అంబటి మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లోకి మరింత ఉధృతంగా వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ నెల రోజుల్లో ప్రతీ గడప గడపకూ వెళ్తున్నాము. ప్రజలకి మేము చేసింది చెప్తున్నామన్నారు. నెలలో 20 రోజులు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు ఇంకా ఏమైనా ఫిర్యాదులు చేస్తే వాటిని వెంటనే పరిష్కారించే దిశగా ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. పథకాలు అందడం లేదంటే అందుకు గల కారణం కనుక్కోవాలన్నారు. టీడీపీ వారికి పనేమీ లేదు గడప గడప కార్యక్రమంపై విమర్శలు చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తే వాస్తవం తెలుస్తుంది. సీఎం జగన్ ఇస్తున్న పథకాలు, పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. టీడీపీ వాళ్లతో పాటు అన్ని పార్టీల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు.













