ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించిన ఎమ్మార్పీఎస్..
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ఈరోజు చంద్రబాబుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇద్దరూ చర్చించుకున్నారు. జగన్ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేసింది అని కృష్ణ మాదిగ విమర్శించారు. అయితే చంద్రబాబు 14 సీట్లు మాదిగలకు కేటాయించారని.. ఈ సందర్భంగా ఆయన పొగిడారు. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ, మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లాంటి అంశాలపై ఈ ఇద్దరి మధ్య సుదీర్ఘమైన చర్చ జరిగింది. 35 అంశాలతో కూడినటువంటి ఒక వినతి పత్రాన్ని ఈరోజు మంద కృష్ణ చంద్రబాబుకు అందజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ మద్దతు ఎన్డీఏ కూటమికే అని మంద కృష్ణ స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని ఈ సందర్భంగా మంద కృష్ణ అన్నారు.













