కూటమికి జేపీ మద్దతు.. హర్షం వ్యక్తం చేసిన లోకేష్..
టీడీపీ-జనసేన-బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి ఆంధ్ర ఎన్నికల బరిలో దిగడం పై లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జై ప్రకాష్ నారాయణ్ మద్దతును తెలియజేశారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులు అఘమ్యాగోచరంగా ఉన్నాయని.. ఇటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యవాదులు ముందుకు రావాలి అని జేపీ పిలుపునిచ్చారు. దీనిపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జేపీ పై ప్రశంసల వర్షం కురిపించారు. రాజకీయపరమైన అంశాలపై సమగ్రమైన అవగాహన కలిగిన వ్యక్తి జయప్రకాష్ నారాయణ అని పేర్కొన్న లోకేష్.. అలాంటివారు ఏపీ ఎన్నికల్లో కూటమికి మద్దతు ప్రకటించడం హర్షించదగిన విషయమని అన్నారు. అంతేకాదు ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తన వంతు పాత్రను పోషించడానికి ముందుకు వచ్చిన జేపీకి కృతజ్ఞతలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా లోకేష్ తన ట్వీట్లో జేపీ గురించి పేర్కొన్న ఈ అంశాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.













