బాలినేని పై ధ్వజమెత్తిన లోకేష్..
వైసీపీ ను రాబోయే ఎన్నికల్లో దారుణ పరాజయం వెంటాడుతోంది అని టీడీపీ యువ నేత నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఆ భయం తోటే వైసీపీ నేతలు ఫేక్ ప్రచారాలు చేస్తూ మరో పక్క దాడులకు కూడా పాల్పడుతున్నారు అంటూ ఆరోపించారు. వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రస్తావించారు. బాలినేని తన అనుచరులుగా వ్యవహరిస్తున్న వాలంటీర్లతో ఎన్నికల ప్రచారం జరపడాన్ని నిలదీసిన టీడీపీ అభిమానులపై దాడికి దిగడం దుర్మార్గమని లోకేష్ అన్నారు. సమతా నగర్ కాలనీ వాసులపై బాలినేని తన గ్యాంగ్ తో దాడి చేయించడాన్ని లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు బాలినేని మరియు అతని గ్యాంగ్ పై కేసు నమోదు చేయవలసిందిగా లోకేష్ కోరారు. అంతేకాదు టీడీపీ శ్రేణులపై దాడికి దిగిన వారిని అరెస్టు కూడా చేయాలని ఆయన అన్నారు.













