అన్నామలై కు మద్దతుగా కోయంబత్తూరులో లోకేశ్ పర్యటన..
ఏపీ ఎన్నికల కోసం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలో కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ తరఫున లోకేష్ తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. బీజేపీ చీఫ్ అన్నామలై కుప్పుస్వామికి మద్దతు తెలుపుతూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండు రోజులపాటు ప్రచారం చేయనున్నారు. కోయంబత్తూర్ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న అన్నామలై కోసం లోకేష్ అక్కడికి వెళ్తున్నారు. కోయంబత్తూర్ లో తెలుగు వారి సంఖ్య అధికంగా ఉండడంతో బీజేపీ లోకేష్ ద్వారా ప్రచారం చేయించి వారిని తమ వైపు తిప్పుకోవడానికి నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో లోకేష్ ఈరోజు, రేపు కోయంబత్తూర్ లో వివిధ ప్రాంతాల్లో పర్యటించి సభలు, సమావేశాలు, రోడ్ షో లాంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. రేపు ఉదయం సింగనల్లూరులోని ఇందిరా గార్డెన్స్‌లో జరిగే సభలో పారిశ్రామికవేత్తలతో లోకేష్ సమావేశం అవుతారు.













