చంద్రబాబుకు షాక్.. రేపు నోటీసులు

కొత్త రకం వైరస్ పేరుతో కర్నూలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని న్యాయవాది చేసిన ఫిర్యాదుపై ప్రతిపక్షనేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రేపు నోటీసులు పంపుతామని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్.ఫకీరప్ప తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్440కే అనే కొత్త రకం కొవిడ్-19 వైరస్ వ్యాప్తిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. కొత్తరకం వైరస్‍పై చంద్రబాబు ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని ఫిర్యాదు అందిందన్నారు. శాస్త్రీయంగా దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రబాబు అరెస్టుపై ఇన్వెస్టిగేషన్ అధికారి తగిన నిర్ణయం తీసుకుంటారు. ఎన్440కే వేరియంట్‍పై విమర్శించడం వేరు, ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం వేరు అని అన్నారు. ఎన్440కే వైరస్ ప్రభావం పెద్దగా లేదని సీసీఎంబీ కూడా ప్రకటించిందని తెలిపారు.