అమరావతి రైతులకు వైసీపీ ఎమ్మెల్యే సంఫీుభావం
పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు వైసీపీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంఫీుభావం తెలిపారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్రలో భాగంగా నెల్లూరు మీదుగా వెళ్తున్న రైతులు, శాలివాహన ఫంక్షన్ హాల్లో బస చేశారు. ఈ క్రమంలో శ్రీధర్ రెడ్డి అక్కడికి వెళ్లి వారి కలిశారు. ఏ అవసరం వచ్చినా తనకు చెప్పాలని తప్పకుండా సహకరిస్తానన్నారు. జై అమరావతి అనాలని రైతులు కోరగా శ్రీధర్ రెడ్డి సున్నితంగా వారించారు. ఆ మాట ఆనేందుకు తనకు కొన్ని ఇబ్బందులున్నాయని వ్యాఖ్యానించారు.













