ప్రశాంత్ కిషోర్‌తో చంద్రబాబు భేటీపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు కలిసిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ మూడు గంటలపాటు చర్చించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. ప్రశాంత్ కిషోర్‌ను తాము 2019లోనే వాడేశామని, అతని బుర్రలో గుజ్జంతా అయిపోయిందని నాని అన్నారు. ఒట్టిపోయిన గేదె వంటి కిషోర్‌ను తెచ్చుకున్న చంద్రబాబు.. అతన్ని తన వ్యూహకర్తగా పెట్టుకుంటున్నాడంటూ ఎద్దేవా చేశారు. ‘ఇదే ప్రశాంత్ కిషోర్‌ను మేం వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడు చంద్రబాబు ఎగతాళి చేశాడు. వాడెవడో బీహార్ నుంచి వచ్చాడట తమ్ముళ్లూ.. అసలు మనకంటే గొప్పవాళ్లు ఎవరైనా ఉన్నారా? అంటూ విమర్శించాడు. జగన్ తన బాబాయిని హత్య చేయించాడని, కోడికత్తితో దాడి కూడా జగన్ ప్లానే అని చెప్పిన చంద్రబాబు.. వీటన్నింటి వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నాడని అప్పట్లో అన్నాడు. మరి ఇప్పుడు చంద్రబాబు తన పీక కోయించుకుంటాడా? లేక లోకేశ్ ప్లాన్ వేసి తండ్రిని చంపుతాడా వాళ్లకే తెలియాలి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నాని.













