ఏపీ రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి… కేంద్రం ప్రత్యేక చర్యలు : కిషన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మూడు రైల్వే సర్వీసులు పొడిగించే కార్యక్రమానికి ఆయన గుంటూరు రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ కేటాయింపులు రూ.886 కోట్ల నుంచి రూ.8,400 కోట్లకు పెంచారన్నారు. అత్యాధునిక సాంకేతికతో తయారైన వందేభారత్ రైళ్లు దేశవ్యాప్తంగా 41 ప్రారంభిస్తే, వాటిలో ఆంధ్రప్రదేశ్ మీదుగా ఐదు వెళ్తున్నాయన్నారు. మోదీ ప్రభుత్వంలో 25,800 కిలోమీటర్ల కొత్త ట్రాక్ వేశారని, అందులో ఆంధ్రప్రదేశ్లోనే 317 కి.మీ. ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అని రైల్వే లైన్లు విద్యుదీకరణ చేశామని తెలిపారు. కొత్త సర్వీసుల పొడిగింపు గుంటూరు నుంచి విశాఖ వెళ్లే వారికి సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.













