సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన అందుకే
జాతీయ స్థాయిలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రాంమోహన్‌రావు జోస్యం చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో కూడా టీడీపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఎన్నికల అధికారులను, ఎన్డీయేతర పార్టీల నాయకులను కలుస్తారని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల కమిషన్ వ్యవరిస్తుందని విమర్శించారు. ఎన్నికల కమిషనర్‌ను ముఖ్యమంత్రి కలుస్తారని వెల్లడించారు. అలాగే ఎన్డీయేతర నాయకులతో కూడా భేటీ అవుతారని చెప్పారు. అందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలనేదే లక్ష్యమని వివరించారు. సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డి, అఖిలేష్ యాదవ్, మాయావతి ఇతర పార్టీల నాయకులతో చంద్రబాబు సమావేశం కానున్నారని సృష్టం చేశారు.













