2024 ఎన్నికల్లో జేడీ పోటీ… ఎక్కడో తెలుసా?
తన రాజకీయ భవిష్యత్తు పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పష్టతనిచ్చారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ నుంచే పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు సంబంధించి తన ఆలోచనను వెల్లడిరచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిస్తే బాగానే ఉంటుందని అన్నారు. అయితే రాష్ట్ర విభజన అంశం సుప్రీంకోర్టులో ఉందని తెలిపారు. అయితే తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయంపై సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతోందని తెలిపారు. తన భావజాలానికి అనుకూలంగా ఉండే పార్టీకి మద్దతుగా ఉంటానని తెలిపారు.













