ఆమెను ప్రధానిగా చూడాలనేదే నా కోరిక!
బీఎస్పీ అధినేత్రి మాయవతితో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ భేటీ లక్నోలో జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా ఎన్నికల్లో పొత్తులపై చర్చలు జరిపినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లుగా తెలియవచ్చింది. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ మాయవతి మార్గనిర్దేశకత్వం చాలా అవసరమని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. సామాజిక న్యాయం అందరికీ అందాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ దేశానికి ప్రధానిగా మయావతిని చూడాలనుకుంటున్నామని.. అది తమ పార్టీ బలమైన అభిలాష అన్నారు.













