కాపు కార్పొరేషన్ చైర్మన్గా జక్కంపూడి రాజా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్గా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే జక్కంపూడి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కృత్ఞతలు తెలిపారు. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జక్కంపూడి రామ్మోహన్ తనయుడే రాజా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జక్కంపూడి కుటుంబం.. ముఖ్యమంత్రి జగన్ వెంటే ఉన్నారు. జక్కంపూడి రాజాను కాపు కార్పొరేషన్ చైర్మన్గా నియమించడంపై కాపు సామాజిక వర్గనేతలు హర్షం వ్యక్తం చేశారు.













