అమెరికన్ కాన్సులేట్ జనరల్‌తో మంత్రి మేకపాటి భేటీ
రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రెఫ్మన్ను ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కోరారు. అమెరికన్ కాన్సులేట్ నిర్వహించిన భారత్-అమెరికా రక్షణరంగ సంబంధాల సదస్సులో మంత్రి ప్రసంగించారు. వస్త్ర పరిశ్రమాభివృద్ధిలో భాగంగా అపెరల్ పార్కుల ఏర్పాటులో శ్రీలంక ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం కానుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెట్టుబడులకు విశాఖనే ఎంచుకునేవారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇంక్యుబేషన్ కేంద్రంగా విశాఖ అవతరించనుందన్నారు. ఈ సందర్భంగా రెఫ్మన్ మాట్లాడుతూ భారత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.













