విశాఖలో మరో అంతర్జాతీయ సదస్సు
మరో అంతర్జాతీయ సదస్సుకు విశాఖలోని ఏపీ మెడ్‌టెక్ జోన్ వేదికగా మారబోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్‌వో) పర్యవేక్షణలో మార్చి 18 నుంచి 9వ అంతర్జాతీయ హెల్త్ టెక్నాలజీ ఎసెస్మెంట్ ఫోరమ్ నిర్వహిస్తున్నారు. మార్చి 24వ తేదీ వరకు మెడ్టెక్జోన్లోని కలాం కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ సదస్సులో కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, సింగపూర్ తదితర దేశాలకు చెందిన వైద్య, ఆరోగ్యశాఖ ప్రతినిధులు, పరిశోధకులు, వైద్య, విద్యావేత్తలు హాజరు కానున్నారు. వైద్య రంగంలో వస్తున్న అత్యాధునిక సాంకేతికతని ఎలా వినియోగించుకోవాలి, కొత్తగా వస్తున్న టెక్నాలజీ బేస్డ్ పరికరాల ప్రదర్శన తదితర అంశాలు ఇందులో చర్చకు రానున్నాయని మెడ్‌టెక్‌జోన్ ప్రతినిధులు తెలిపారు.













