ఈసారి కూడా వైసీపీ కన్ఫామ్.. ఇంటలిజెన్స్ బ్యూరో రిపోర్ట్
ఆంధ్రాలో ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో రాజకీయం ఎంతో రసవత్తంగా మారుతుంది. సీఎం జగన్ ఒక పక్క.. ఎన్ డి ఏ కూటమి మరొక పక్క అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నాయి. మధ్యలో కాంగ్రెస్ కూడా తన వంతు ప్రచారం చేస్తూ ముందుకు సాగుతోంది. ఒకరి ఎత్తులకు మరొకరు పైఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు ప్రచారం తో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో జరగబోయే ఎన్నికలపై ఆంధ్రాలో ఇంటలిజెన్స్ బ్యూరో ఎన్నికల రిపోర్ట్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ఏపీ రాజకీయాలలో సంచనలంగా మారింది. ఈ రిపోర్ట్ ప్రకారం వైసీపీకి 124 సీట్లు, ఎన్డీయే కూటమిని 51 సీట్లు వస్తాయి అని అంచనా. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా దీనిపై స్పందించిన చంద్రబాబు ఈ రిపోర్టు బూటకం అని కొట్టిపారేశారు. ఈసారి గెలుపు తమ కూటమిదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.













